Tuesday, April 14, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్దావోస్ పర్యటనలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

దావోస్ పర్యటనలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

•‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’పై సీఎం చంద్రబాబు ప్రసంగం అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించింది-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి21
వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 (దావోస్) వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కీలక చర్చల్లో పాల్గొనడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు.ప్రత్యేకంగా దావోస్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఐఐ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం అంతర్జాతీయ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే ముఖ్యమంత్రి నిబద్ధత, నిరంతర తపన ఈ పర్యటనలో అత్యంత దగ్గరుండి చూసే అవకాశం లభించిందన్నారు.రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా అవతరించబోతోందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular