📄 ePaper
Friday, September 4, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసదాశివపేట క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సదాశివపేట క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

📰 Generate e-Paper Clip

సదాశివపేట,జనవరి 12(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సంగారెడ్డి నియోజకవర్గ గౌరవశాసనస భ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారు పంపిణీ చేశారు.సోమవారం రోజున సదాశివపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 21 మంది లబ్ధిదారులకు రూ.6,80,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ…నిరుపేద కుటుంబాల కు వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. గత పదేళ్లకు పైగా పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను అహర్నిశలు కృషి చేస్తూ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు లబ్ధిదారుల తరఫున ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, యువత అధ్యక్షులు నరేష్ గౌడ్, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరి, సర్పంచులు కిష్టారెడ్డి, ప్రమోద్, తొంట కిష్టయ్య, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, రాములు, చంద్రన్న, సిద్ధన్న, నల్లల కుమార్, మాణిక్, నాయకులు యాద గౌడ్, రమేష్, బాబూజీ, నవీన్, మల్లేశం, జానీ మియా, హరిపొద్దిన్, యోహన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.