📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుస్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన నేతాజీ సేవలు చిరస్మరణీయం: సర్పంచ్ మామిడి రాజు

స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన నేతాజీ సేవలు చిరస్మరణీయం: సర్పంచ్ మామిడి రాజు

📰 Generate e-Paper Clip

•నేటి యువతకు జ్వలంత స్ఫూర్తి నేతాజీసుభాష్ చంద్రబోస్:సర్పంచ్ మామిడి రాజు

మనప్రజాప్రతినిధి,//మానకొండూర్.జనవరి23
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో, పాలకవర్గం సహకారంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి నేటి యువతకు శాశ్వత ఆదర్శమని పేర్కొన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నేతాజీ జీవితం ప్రతి యువకుడిని దేశ సేవ వైపు నడిపించాల్సిన మార్గదర్శకమని తెలిపారు.నేటి యువత నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సులభంగా రాలేదని, అనేకమంది మహానీయుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో ముస్కానిపేట గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు మామిడి సుశీల, చేరాల వంశీ, రాకం సుమన్, అంతటి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒగ్గు రమేష్, కొట్టే వెంకన్న, గడ్డం రవీందర్ రెడ్డి, కునబోయిన దేవయ్య, అంగన్వాడీ టీచర్లు విజయ, అరుణ, బాబాయి, బీఎల్ఓ రహిమున్నిస, నర్సయ్య, యువజన సంఘాల నాయకులు ఎర్రోజు రవితేజ, ఎర్రోజు సంతోష్ కుమార్, ఎలుక రాము, దయ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.