📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఎల్లారెడ్డిపేటలో ఘనంగా నేతాజీ 129వ జయంతి వేడుకలు.

ఎల్లారెడ్డిపేటలో ఘనంగా నేతాజీ 129వ జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ-ముఖ్యఅతిథిగా ఎంఆర్ఓ డి.సుజాత
నేతాజీ త్యాగాలను స్మరించుకున్న ఎంఆర్ఓ సుజాత

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.జనవరి23
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఆర్ఓ డి. సుజాత గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్ఓ సుజాత గారు మాట్లాడుతూ… “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను” అనే నినాదంతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు.విద్యార్థులు నేతాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
నేతాజీ జయంతిని పురస్కరించుకుని నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కిట్లను ఎంఆర్ఓ సుజాత గారు పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న నేతాజీ సేవా సమితి సభ్యులను ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కొక్కల వీర ప్రభాకర్, నేతాజీ సేవా సమితి అధ్యక్షులు చెట్కూరి దినేష్ గౌడ్, సభ్యులు మారవేణి రంజిత్ కుమార్, వరుస రాకేష్, అజ్మీరా విశ్వనాధ్, కానమనేని వినయ్, మనుక రాజు, బుర్రవేణి ప్రవీణ్, శ్రీపాద విశ్వం చారి, అధ్యాపక బృందం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.