📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువెల్జీపూర్ గ్రామంలో ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి కార్యక్రమం..

వెల్జీపూర్ గ్రామంలో ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

•ఎన్టీఆర్ ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి-వెల్జీపూర్‌లో ఘననివాళులు.

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి18
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వెల్జీపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షులు బొల్లారం పరుశురాం, వార్డు సభ్యులు బొల్లారం ప్రసన్నకుమార్, బొజ్జ శ్రీనివాస్, బీజేపీ గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు వోరెం భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే గ్రామ పెద్దలు వోరెం నారాయణరెడ్డి, వంగపెల్లి మోహన్ రెడ్డి, పందిళ్ల నర్సయ్య, దేశెట్టి నారాయణ, చిలువేరి బాలరెడ్డి పాల్గొనగా, గ్రామ యువకులు చిలువేరి రాజేందర్ రెడ్డి, ఓరెం సాయికిరణ్ రెడ్డి, వంగపల్లి నవీన్ కుమార్, వోరెం దినేష్ రెడ్డి, సుధగోని ఆదినాథ్, సుధీర్, ఎడ్ల అభినయ్ తదితరులు హాజరయ్యా రు.ఎన్టీఆర్ ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయ మని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని పలువురు వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.