📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణప్రాథమిక పాఠశాల ఘణపురం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రాథమిక పాఠశాల ఘణపురం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తొగుట, జనవరి 26

తొగుట మండలం ప్రాథమిక పాఠశాల ఘణపురంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. చంద్రకళ జాతీయ పతాకం ఎగరవేశారు. ఆటల పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను గ్రామ సర్పంచ్ గంగసాని రాజిరెడ్డి అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. కార్యక్రమంలో AAPC చైర్ పర్సన్ బోనాల లావణ్య, ఉప సర్పంచ్ బోధనం రమేష్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, వనజ, రవీందర్, రాజ్ కుమార్, రవి, ప్రేమల, నవనీత విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.