📄 ePaper
Friday, June 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురోడ్డుభద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కోనరావుపేట ఎస్సైప్రశాంత్ రెడ్డి

రోడ్డుభద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కోనరావుపేట ఎస్సైప్రశాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

•‘ప్రాణాలతో గమ్యానికి చేరండి’‘ARRIVE అలివేలు కార్యక్రమంలో రోడ్డుభద్రతపై అవగాహన
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి17
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోనరావుపేట ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి సూచించారు. శనివారం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాణాలతో గమ్యానికి చేరండి’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదని, వాహనదారులు నిర్లక్ష్యం వహించకుండా రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాద సమయంలో అది ప్రాణరక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.మత్తులో వాహనాలు నడపడం వల్ల స్వీయ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. వయస్సు నిండని మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఇతర పరధ్యానాలకు దూరంగా ఉండాలని, పూర్తి ఏకాగ్రతతో వాహనం నడపాలని సూచించారు.గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే ‘ARRIVE ALIVE’ప్రాణాలతో గమ్యానికి చేరండి’ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular