Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు

మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

మెదక్ మాజీఎమ్మెల్యే మైనంపల్లిహనుమంతరావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
మెదక్ జిల్లా:మనప్రజాప్రతినిధి//జనవరి10
మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయన పుట్టినరోజును అర్థవంతంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బొల్లారం మాజీ ఎంపీటీసీ బెండ రమేష్ అన్న ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో దుప్పట్ల పంపిణీ చేపట్టారు. మంబోజిపల్లి వద్ద 150 దుప్పట్లు, కొముటూరు గ్రామం వద్ద 200 దుప్పట్లు, పాతూరు చౌరస్తా వద్ద 150 దుప్పట్లు పంపిణీ చేసి మొత్తం 500 దుప్పట్లు పేదలకు అందజేశారు.అదేవిధంగా యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించారు. రాజ్‌పల్లి గ్రామంలో క్రికెట్ యువతకు రూ.20,000లు, గుట్ట కిందపల్లి గ్రామ క్రికెట్ క్రీడాకారులకు రూ.15,000లు, శివాయిపల్లి గ్రామ యువతకు రూ.15,000లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొని మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular