మన ప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 30:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు నుంచి అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా షేక్ ముజహీద్ నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని, అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు మద్దతు తెలిపారు.

