📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచైనా మాంజా వినియోగంపై కఠిన చర్యలు తప్పవు-చిరాగ్‌పల్లి ఎస్సై కే.రాజేందర్ రెడ్డి హెచ్చరిక

చైనా మాంజా వినియోగంపై కఠిన చర్యలు తప్పవు-చిరాగ్‌పల్లి ఎస్సై కే.రాజేందర్ రెడ్డి హెచ్చరిక

📰 Generate e-Paper Clip

మొగుడంపల్లి, జనవరి5(మనప్రజాప్రతినిధి):
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రాణాంతకమైన నిషేధిత చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేయవద్దని చిరాగ్‌పల్లి సబ్‌ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే. రాజేందర్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలో చైనా మాంజాను నిల్వ చేయడం,రవాణా చేయడం, తయారు చేయడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు.జాతీయ హరిత ట్రైబ్యునల్ మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చైనా మాంజా వినియోగం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.చైనా మాంజా వలన ద్విచక్ర వాహనదారు లు, పాదచారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడటంతో పాటు పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఎస్సై రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై ఎలాంటి సడలింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.