📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజాస్వామ్య బలోపేతానికి విద్యార్థుల ప్రతిజ్ఞ – మొగుడంపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘన...

ప్రజాస్వామ్య బలోపేతానికి విద్యార్థుల ప్రతిజ్ఞ – మొగుడంపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘన నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఓటు హక్కు విలువను విద్యార్థులకు వివరించిన ఇన్‌చార్జ్ హెచ్‌ఎం ప్రకాష్-ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ

ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం-మొగుడంపల్లి పాఠశాలలో విద్యార్థుల ప్రతిజ్ఞ

మొగుడంపల్లి,జనవరి23(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 23వ తేదీ శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మయూరి, అనిత, పీటీ శోభా, శైలజ, సురేఖ, నజీర్ షరీఫ్, షకీల్ మాజిద్, నాసర్, షఫీ అహ్మద్, మదన్మోహన్, నర్సింగ్ పవర్, నిసర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.అనంతరం ఉపాధ్యాయు లు, విద్యార్థులు కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు.“భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయా లను కాపాడుతూ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉంటామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము” అని వారు ప్రతిజ్ఞ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.