📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణనారాయణ ఖేడ్ లో రోడ్డెక్కనున్న బిఆర్ఎస్ వర్గపోరు

నారాయణ ఖేడ్ లో రోడ్డెక్కనున్న బిఆర్ఎస్ వర్గపోరు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 31: నారాయణఖేడ్ లో  ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో వర్గపోరు రోడెక్కనుంది.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ర్యాలీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయనున్నట్లు శనివారం మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి GMR ఫౌండేషన్ చైర్మన్,బిఆర్ఎస్ నాయకులు గుర్రం మచ్చెందర్ లు వేర్వేరుగా ప్రకటనలు ఇచ్చారు.అంతేకాకుండ ఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ ఉన్నందున పోలీసుల అనుమతి కోసం గుర్రం మచ్చెందర్ వర్గీయులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు.ఖేడ్ పట్టణంలో భూపాల్ రెడ్డి మరియు మచ్చెందర్ లు పోటాపోటీగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడం విశేషం.మున్సిపల్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీలో ఇలా వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తే పార్టీ కార్యకర్తలు, అభిమానులు దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తారని,ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఆలోచించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.