📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన నగర కమిషనర్

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన నగర కమిషనర్

📰 Generate e-Paper Clip

గుంటూరు జనవరి 5 (మనప్రజాప్రతినిధి): నగర శివారులో ప్రపంచ మూడవ తెలుగు మహాసభల ముగింపు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు నగర మహాసభల దగ్గర సీఎం చంద్రబాబుకు ,నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. వేదిక  వద్దకు తోడుకొని వెళ్లారు .నగరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న తెలుగు మహాసభల కు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి విజయవంతంగా పూర్తి అయ్యేలా కృషి చేశామని సీఎం చంద్రబాబుకు వివరించారు .తెలుగు మహాసభకు విచ్చేసినఇతర అతిధులకు సైతం సాదర ఆహ్వానంతో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.నగర కమిషనర్ స్వాగతానికి, వివరణను ఆలకించి సీఎం చంద్రబాబు ఆయనను, అభినందించారు.ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మహాసభల ఏర్పాట్లకు తీసుకున్న చర్యలనుకూడా వివరించారు. అన్ని మౌలిక సదుపాయాలను మహాసభల వద్ద కల్పించినట్లు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.