Monday, April 20, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఆత్మీయతకు అద్దం పట్టిన నారా–బొజ్జల కుటుంబాల కలయిక

ఆత్మీయతకు అద్దం పట్టిన నారా–బొజ్జల కుటుంబాల కలయిక

📰 Generate e-Paper Clip

నారావారిపల్లెలో నారా–బొజ్జల కుటుంబాల చారిత్రాత్మక ఆత్మీయ కలయిక
రాజకీయాలకు అతీతంగాబలమైన బంధం-నారా–బొజ్జల కుటుంబ భేటీ
ఒకటైన నారా–బొజ్జలకుటుంబాలు…నారావారిపల్లెలో ఆత్మీయ వాతావరణం

శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి14(మనప్రజాప్రతినిధి)
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులతో నారావారిపల్లెలో నారా-బొజ్జల కుటుంబాల మధ్య ఆత్మీయ బంధం మరింత బలపడింది. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నారావారిపల్లెలో ఆత్మీయంగా కలిశారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రాధిపతి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు అందజేసి వారి ఆశీస్సులు పొందారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ప్రత్యేక ఆధ్యాత్మిక భావోద్వేగానికి గురిచేసింది.ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…“వెంకట సుధీర్ రెడ్డి నా కుటుంబ సభ్యుడే” అని ఆత్మీయంగా పేర్కొన్నారు. తన సన్నిహిత మిత్రుడు, దివంగత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిని స్మరిస్తూ, ఆయన లేని లోటును తానే తీరుస్తానని భావోద్వేగంగా చెప్పారు. “వెంకట సుధీర్ రెడ్డికి అన్నివేళలా అండగా ఉంటాను” అంటూ మాట ఇవ్వడం అక్కడున్న వారిని కదిలించింది.ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, బొజ్జల బృందమ్మ సొంత అక్కచెల్లెల్లుల్లా కలుసుకుని పరస్పరం ఆప్యాయతను పంచుకున్నారు. వారి ఆత్మీయత పండుగ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చింది.
భోగి పండుగను పురస్కరించుకొని నారావారిపల్లెలో నారా – బొజ్జల కుటుంబాలు “ఒకటే కుటుంబం” అన్న భావనకు ప్రతీకగా కలిసి భోగి మంటలు వేసి, కార్యకర్తలతో కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో పండుగ సంబరాలు జరుపుకున్నారు. గ్రామమంతా పండుగ కళతో కళకళలాడింది.ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మధ్య కనిపించిన ఆప్యాయత, అలాగే నారా భువనేశ్వరి – బొజ్జల బృందమ్మల మధ్య సోదరసోదరీ భావం అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ ఆత్మీయ కలయిక నారావారిపల్లెలో ఒక కుటుంబ వేడుకలా మారి, రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాల విలువను మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular