📄 ePaper
Sunday, June 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామీణ క్రీడలకు ఊపునిచ్చిన మెలగిరిపేట వాలీబాల్ పోటీలు

గ్రామీణ క్రీడలకు ఊపునిచ్చిన మెలగిరిపేట వాలీబాల్ పోటీలు

📰 Generate e-Paper Clip

•మెలగిరిపేటలోక్రీడలపండుగ-ఫ్రెండ్స్ యూత్bవాలీబాల్ పోటీలు.•ఆరుజట్ల,మధ్యఉత్కంఠభరితపోటీలు-ప్రశాంత్ రెడ్డి జట్టు విజేత
సదాశివపేట,జనవరి16(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలం మెలగిరిపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షాబుద్దీన్, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాములు, ఉపసర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు మల్లారెడ్డి శ్రీనివాస్, నరసింహారెడ్డి, మహేందర్, యాదుల్ యేసుబు, ఉషయ్య, రియాజ్‌తో పాటు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నవాజ్ అహ్మద్ పాల్గొన్నారు.ఈ వాలీబాల్ పోటీల్లో మొత్తం ఆరు జట్లు తలపడ్డాయి. సర్పంచ్ షాబుద్దీన్, ప్రశాంత్ రెడ్డి, నిజాముద్దీన్ అహ్మద్, నరేందర్, భాస్కర్ జట్లు కేప్టెన్స్‌గా పోటీల్లో పాల్గొన్నారు.ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రశాంత్ రెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టులో మారుతి, డాకారెడ్డి, శివాజీ, రామాచారి, మదన్ కీలక పాత్ర పోషించారు. రన్నర్‌గా నిజాముద్దీన్ అహ్మద్ జట్టు నిలిచింది.
విజేత జట్టుకు చంద్రయ్య రూ.5,000 నగదు బహుమతి అందజేయగా, రన్నర్ జట్టుకు రామ్ రెడ్డి రూ.3,000 నగదు బహుమతి అందజేశారు. అలాగే అద్భుత ప్రతిభ కనబరిచిన రామాచారి, ప్రణీత్‌లకు ఉపసర్పంచ్ యాదయ్య రూ.1,000 చొప్పున నగదు బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా టోర్నమెంట్ కప్స్, మెడల్స్‌ను నవాజ్ అహ్మద్‌తో పాటు ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజర్ అహ్మద్ అందజేశారు. పోటీల సందర్భంగా భోజన సదుపాయాలను కూడా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువజన సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular