📄 ePaper
Sunday, June 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుక్రీడలే యువతకు దిశానిర్దేశం : టీజీఐఐసీ చైర్‌పర్సన్.

క్రీడలే యువతకు దిశానిర్దేశం : టీజీఐఐసీ చైర్‌పర్సన్.

📰 Generate e-Paper Clip

క్రీడలు మానసికఉల్లాసానికి దోహదపడతాయి :నిర్మలజగ్గారెడ్డి.
వెల్టూరు గ్రామప్రీమియర్ లీగ్–2క్రికెట్ టోర్నమెంట్‌లోవిజేతగా కమాండోస్ జట్టు
సదాశివపేట,జనవరి16(మనప్రజాప్రతినిధి)
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువకులు చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో కీర్తిశేషులు మాజీ సర్పంచ్ పబ్బతి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పబ్బతి రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెల్టూరు గ్రామ ప్రీమియర్ లీగ్–2 (2026) క్రికెట్ టోర్నమెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొని ఉత్కంఠభరితంగా తలపడ్డాయి. ఫైనల్‌లో వెల్టూరు గ్రామానికి చెందిన కమాండోస్ జట్టు (కెప్టెన్ రాకేష్) విజేతగా నిలవగా, అదే గ్రామానికి చెందిన రైసింగ్ టైటాన్ జట్టు రన్నర్‌గా నిలిచింది.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా దానిని భవిష్యత్ విజయాలకు నాందిగా భావించాలని సూచించారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈటోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన పబ్బతి రత్నాకర్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.విజేత కమాండోస్ జట్టుకు రూ.40,000 నగదు బహుమతితో పాటు విన్నర్ కప్‌ను, రన్నర్ రైసింగ్ టైటాన్ జట్టుకు రూ.20,000 నగదు బహుమతి, కప్‌ను నిర్మల జగ్గారెడ్డి చేతులమీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగులపల్లి ప్రభు, వెంకటాపూర్ సర్పంచ్ ఒగ్గు శ్రీనివాస్, రఘువీరా రెడ్డి, బలరాం శ్రీనివాస్, బాబు, ఆంజనేయులు, శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శైలేందర్ రెడ్డి, తొంటరాజు సురేష్, చోటు ప్రభు, వార్డు సభ్యులు సుందర్, సామెల్, ఫయాజ్, శ్రీకాంత్‌లతో పాటు గ్రామ యువకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular