📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్భక్తుల కోరికలు తీర్చే శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నూతన వస్త్ర సేవా కార్యక్రమం ఘన ప్రారంభం

భక్తుల కోరికలు తీర్చే శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నూతన వస్త్ర సేవా కార్యక్రమం ఘన ప్రారంభం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్ 4
సకల పాపాలను హరించి, భక్తుల కోరికలను తీర్చే పంచభూత లింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధి ఆధ్యాత్మిక శక్తితో విరాజిల్లుతోంది. రాహు–కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది. అలాంటి పవిత్ర క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి వంటి శుభ తిథి సందర్భంగా భక్తుల ఆరాధనకు మరింత అవకాశాన్ని కల్పిస్తూ నూతన వస్త్ర సేవా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.గౌరవనీయులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబు (గిరి నాయుడు) సూచనలతో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈ వస్త్ర సేవను అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా భక్తులు స్వామివారికి నేరుగా సేవ చేయడంతో పాటు అపారమైన పుణ్యఫలాలను పొందే అవకాశాన్ని కల్పించారు.ఈ నూతన వస్త్ర సేవకు ఉబయదారులుగా.సహస్ర హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శబరి, డాక్టర్ శారదా,కేఆర్ గ్రూప్స్ తిరుపతి యాజమాన్యం కంది శెట్టి యువ కిషోర్ – వారి ధర్మపత్ని వైష్ణవి,తిరుపతి వాస్తవ్యులు శ్రీమతి శ్రీ కంది శెట్టి రమేష్ – వారి ధర్మపత్ని కోయిలమ్మపాల్గొని స్వామివారికి వస్త్ర సమర్పణ చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబు (గిరినాయుడు) ఆలయ కార్యనిర్వాహణాధికారి భక్తులకు ఆలయ సంప్రదాయాల ప్రకారం తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద పండితుల ఆశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి కృపతో తమ కుటుంబాలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భక్తులు ప్రార్థించారు.అదేవిధంగా సాయంత్రం ప్రదోష కాలమున మరో వస్త్ర సేవా కార్యక్రమం నిర్వహించగా, గంగయ్య యాదవ్వారికుటుంబ సభ్యులు ఈ సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. వారికి కూడా ఆలయ మర్యాదలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి మాట్లాడుతూ,ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం నాడు స్వామివారికి నిర్వహించే వస్త్రాభిషేక సేవలో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా ఆలయంలో తమ పేరుపై వస్త్ర సేవ టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాలని సూచించారు.వస్త్ర సేవ టికెట్ ధరను రూ.5,000/-**గా నిర్ణయించినట్లు వెల్లడించారు.శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుగ్రహంతో ఈ నూతన వస్త్ర సేవా కార్యక్రమం భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ, ఆలయ వైభవాన్ని మరింత పెంచుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.