📄 ePaper
Thursday, September 3, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునారాయణపూర్‌లో ఘనంగా గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం

నారాయణపూర్‌లో ఘనంగా గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి14
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బుధవారం నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.
శాస్త్రోక్తంగా వేడుకలుఅర్చకులు వేణుగోపాల చారి, నవీన్ చారి, శివ శాస్త్రిల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, వేడుకోళ్లు నిర్వహించారు. అనంతరం శివాలయం సమీపంలోని కళ్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛారణల నడుమగోదారంగనాథుల కళ్యాణం శాస్త్రోక్తంగా సాగింది.వేములవాడ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన నారాయణపూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే ఈ కళ్యాణానికి ప్రత్యేక విశిష్టత ఉంది. సంప్రదాయం ప్రకారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ప్రత్యేకంగా పంపించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామస్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రముఖుల పాల్గొనడం
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎస్‌కే సాబేరా బేగం, ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు పాల్గొన్నారు.అలాగే అధికారులు ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రాహుల్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, దేవాదాయ శాఖ రిటైర్డ్ కమిషనర్ నునుగొండ మల్లయ్యతో పాటు నిమ్మ సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, లదునూరి హనుమాన్లు, ఇతర గ్రామ సర్పంచులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.