📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక నెల –తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక నెల –తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

📰 Generate e-Paper Clip


సిద్దిపేటనియోజకవర్గం.జనవరి23(మనప్రజాప్రతినిధి)
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రగతి కోసం తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి కోరారు.శుక్రవారంకళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇంటర్ విద్య బలోపేతానికి అనుకూలంగా చర్యలు తీస్తుందని, కళాశాల ఆధునికీకరణ, ల్యాబ్ మెటీరియల్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాల కోసం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
డిజిటల్ విద్యకు శ్రీకారం:
కళాశాలలో 4 డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు డిజిటల్ విద్య ప్రారంభించామని, విడుదల చేసిన నిధుల ఉపయోగాల వివరాలను తల్లిదండ్రులకు వివరించామని చెప్పారు.
విద్యార్థుల ప్రగతి, హాజరు, ఫలితాలు:
అధ్యాపకులు విద్యార్థుల ప్రగతి, హాజరు శాతం, అంతర్గత పరీక్షల ఫలితాలను పేరెంట్స్‌కు వివరించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడాలని సూచించారు.
జాతీయ ఓటరు దినోత్సవం:
సివిక్స్ లెక్చరర్ నంట శ్రీనివాస్ రెడ్డి జాతీయ ఓటరు దినోత్సవ ప్రాధాన్యతను వివరించి, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులచే ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేయించించారు.
సన్మానం:
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారిని, హాస్టల్ వార్డెన్లను శాలువాతో సన్మానించారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, స్టూడెంట్స్ కౌన్సిలర్లు కనక చంద్రం, ఫాతిమా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ధరిపల్లి నగేష్, స్పోర్ట్స్ ఇంచార్జ్ అశోక్, అధ్యాపకులు రఘురాజ్, గంగాధర్, వెంకటరమణ, శ్రీకాంత్, రాజలక్ష్మి, నరేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అఖిల్, కొమురయ్య, రవి, శ్రీకాంత్, విజయభాస్కర్, రాజశేఖర్, సత్యనారాయణ, దాస్, శ్రీనివాస్, చక్రవర్తి, కళాశాల సిబ్బంది విఠల్, రషీద్, రమేష్, వెంకటేష్, శంకర్, కలీం, బాలకిషన్, నయీమున్నీసా తదితరులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.