📄 ePaper
Saturday, October 17, 2026
Homeఆంధ్రప్రదేశ్తిరుచానూరులో పార్కింగ్ మాఫియా రాజ్యం-భక్తులకు నరకయాతన

తిరుచానూరులో పార్కింగ్ మాఫియా రాజ్యం-భక్తులకు నరకయాతన

📰 Generate e-Paper Clip

•మాడ వీధుల్లో వాహనాల ఆక్రమణ – ప్రశ్నించిన మీడియాపై బెదిరింపులు
•తిరుచానూరులో పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం – భక్తులు, స్థానికుల ఆగ్రహం
మనప్రజాప్రతినిధి,తిరుపతిజిల్లా,ఫిబ్రవరి7:
శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో పార్కింగ్ వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పి భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు మాడ వీధులు వాహనాలతో నిండిపోవడంతో రాకపోకలు స్తంభించి, అత్యవసర పరిస్థితుల్లోకూడా వాహనాలువెళ్లలేనిపరిస్థితిఏర్పడుతోంది.సూర్యనారాయణ స్వామి ఆలయం నుండి పద్మావతి కన్వెన్షన్ వరకు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సిబ్బంది విచ్చలవిడిగా వాహనాలను నిలిపివే స్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు వరుసలుగా కార్లు నిలిపివేయడం వల్ల ద్విచక్రవాహనాలు కూడావెళ్లలేని పరిస్థితి నెలకొంది.గుర్తింపు కార్డులు లేకుండానే పనిచేస్తున్న కొంతమంది పార్కింగ్ సిబ్బంది, ప్రశ్నించిన భక్తులు స్థానికులను బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్కింగ్ దుర్వ్యవస్థపై ఫోటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధిని కూడా బెదిరించిన ఘటన పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది.ఈ నేపథ్యంలో నాలుగు మాడ వీధుల్లో పూర్తిస్థాయి పార్కింగ్ నిషేధం అమలు చేసి, పార్కింగ్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు టిటిడి అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.