📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురైతుల వోల్టేజ్ కష్టాలకు శాశ్వత ముగింపు – ప్రభుత్వ చొరవతో నూతన ట్రాన్స్‌ఫార్మర్

రైతుల వోల్టేజ్ కష్టాలకు శాశ్వత ముగింపు – ప్రభుత్వ చొరవతో నూతన ట్రాన్స్‌ఫార్మర్

📰 Generate e-Paper Clip

ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో రైతులకు విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
టీవైడీఏ నిధులతో వేపలమాధరం గ్రామంలో నూతన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు.ఫిబ్రవరి31
మేళ్లచెరువు మండల పరిధిలోని వేపలమాధరం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. తోట వెంకటేశ్వర్లు పొలానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తీవ్ర వోల్టేజ్ సమస్య ఉండటంతో, అపర భగీరథుడిగా పేరుగాంచిన రైతు బాంధవుడు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో టీవైడీఏ పథకం కింద బడ్జెట్ కేటాయించి నూతనంగా 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు.ఈ నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామ మాజీ సర్పంచ్ భోగాల మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లైన్మెన్ చారి, ఉపసర్పంచ్ మల్‌రెడ్డి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సునీత బాలరాజు, మాజీ ఎంపీటీసీ పోషబోయిన వెంకయ్య, వార్డు సభ్యులు పలిశెట్టి వెంకయ్య, పారెల్లి వీరయ్య, మల్‌రెడ్డి పకీరారెడ్డి, తోట వెంకటనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామంలో విద్యుత్ సమస్యలు పరిష్కారమవడంతో రైతులకు వ్యవసాయ పనులు మరింత సులభమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.