📄 ePaper
Wednesday, August 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువేగంగా దూసుకొచ్చిన బైక్– రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

వేగంగా దూసుకొచ్చిన బైక్– రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి-గ్రామంలో విషాదం
అంబులెన్స్ అందుబాటులో లేక ఆటోలో తరలింపు.మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన దుర్గవ్వ
సిద్దిపేట,ఫిబ్రవరి6(మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొర్ర దుర్గవ్వ (భర్త లచ్చయ్య) మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.గ్రామం చివర ఇల్లు నిర్మించుకునినివసిస్తున్నదుర్గవ్వమహిళాసంఘంచిట్టిచెల్లించేందుకు వెళ్తున్న సమయంలో నయారా పెట్రోల్ బంక్ ముందు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న పల్సర్-220 ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమెకు కాలు విరగడం తో పాటు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అది అందుబాటులో లేక వేరే ప్రాంతానికి వెళ్లిందని సమాచారం అందింది. దీంతో స్థానికులు వెంటనే ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా,మార్గమధ్యంలోనే దుర్గవ్వమృతిచెందింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఇరుకోడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.