📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుభార్య తరఫున ప్రచారం..కానిస్టేబుల్ సస్పెన్షన్

భార్య తరఫున ప్రచారం..కానిస్టేబుల్ సస్పెన్షన్

📰 Generate e-Paper Clip

•రష్మీ పెరుమాళ్ ఆదేశాలు-చేర్యాల మున్సిపల్ ఎన్నికలలో కోడ్ •ఉల్లంఘనపై శాఖాపరమైన విచారణ ప్రారంభం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి8
చేర్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ భార్య తరఫున ప్రచారం చేసిన కోమురవెల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కె. రమేష్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఉత్తర్వులు జారీ చేశారు.విధినిర్వహణలో ఉండాల్సిన సమయంలో డ్యూటీకి హాజరుకాకుండా క్రమశిక్షణారహి త్యం ప్రదర్శించడంతో పాటు, జరుగుతున్న చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సమయంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.