📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు–మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై కేసు నమోదు

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు–మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

సదాశివపేట,ఫిబ్రవరి10(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.మంగళవారం సదాశివపేటలో కొంతమంది ఓటర్లకు, ముఖ్యంగా పేదలు.వృద్ధులకు నగదు పంపిణీ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న సదాశివపేట సీఐ వెంకటేష్, సంఘటన స్థలంలో ఉన్న స్థానికులను విచారించి, జగ్గారెడ్డిని అక్కడి నుంచి వెళ్లగొట్టినట్లు తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నగదు పంపిణీ చేయడం నియమావళి ఉల్లంఘనగా పరిగణించి, సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో జగ్గారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేష్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular