📄 ePaper
Tuesday, August 25, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొండాపూర్ పెద్దమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ప్రారంభం

కొండాపూర్ పెద్దమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ప్రారంభం

📰 Generate e-Paper Clip

నేరాల నియంత్రణలో ‘మూడవ కన్ను’గా సీసీ కెమెరాలు-చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు
మనప్రజాప్రతినిధి//కోనరావుపేట,ఫిబ్రవరి07:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో వెలసిన పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను శనివారం చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు, కోనరావుపేట ఎస్ఐ కె. ప్రశాంత్ రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు “మూడవ కన్ను”లా పనిచేస్తాయని తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించడంలో, కేసుల దర్యాప్తులో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
భక్తి భావంతో పాటు సామాజిక బాధ్యతగా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంఘం సభ్యులను పోలీసు శాఖ తరపున ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో గ్రామాల్లోని ఇతర సంఘాలు, దాతలు.గ్రామ పెద్దలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.ప్రతి గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద నిఘాకెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలు మరియు ఇతర నేరాలను సమర్థవంతం గా అరికట్టవచ్చని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు,గ్రామ పెద్దలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.