📄 ePaper
Tuesday, August 25, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు23వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం:మద్ది బోయన శృతి సంతోష్

23వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం:మద్ది బోయన శృతి సంతోష్

📰 Generate e-Paper Clip

మెదక్, ఫబ్రవరి9(మనప్రజాప్రతినిధి):
మెదక్ మున్సిపాలిటీ 23వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మద్ది బోయన శృతి సంతోష్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.
వార్డు సమగ్ర అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగినట్లు ఆమె తెలిపారు. ప్రజల ప్రేమాభిమానంతో గెలిపిస్తే 23వ వార్డును మెదక్ పట్టణంలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆడబిడ్డ జన్మించిన కుటుంబాలకు రూ.5 వేల సహాయం అందిస్తానని పేర్కొన్నారు. శుభకార్యాల కోసం టెంట్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు.వార్డులో అనేక సమస్య లు ఉన్నప్పటికీ గతంలో ఉన్న నాయకులు మాటలు మాత్రమే చెప్పి పనులు చేయలేదని విమర్శించారు. తాను గెలిస్తే సీసీ కెమెరాల ఏర్పాటు, చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణం, సీసీ రోడ్ల అభివృద్ధి వంటి పనులు చేపట్టి వార్డును అభివృద్ధి చేస్తానని శృతి సంతోష్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.