📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువేములవాడ మండలం చంద్రగిరిలో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

వేములవాడ మండలం చంద్రగిరిలో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

📰 Generate e-Paper Clip

•బీడీ కార్మికుల కాలనీలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
మనప్రజాప్రతినిధి//వేములవాడ.ఫిబ్రవరి19
చంద్రగిరి గ్రామంలోని బీడీ కార్మికుల కాలనీలో నెలలుగా కొనసాగు తున్న లో-వోల్టేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్ విజ్ఞప్తి మేరకు సెస్ డైరెక్టర్ చరణ్ రావు ప్రత్యేక చొరవతో మంజూరైన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ (డిటిఆర్)ను సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలఅవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సూచించిన ప్రతి సమస్యను దశలవారీ గా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల కాలనీలో విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండటంతో పాటు,గృహ అవసరాలుచిన్న వ్యాపార కార్యకలాపాలకు గణనీయమైన ఊరట లభించనుంది.కార్యక్రమంలో సెస్ ఏడీ అనిల్ కుమార్, ఏఈ, ఉపసర్పంచ్ ఈర్నాల రాజు, వార్డు సభ్యులు పూసాల సంతోష్, ఎడెల్లి మల్లయ్య, ఎడెల్లి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.