📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాజన్న సిరిసిల్ల జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఘనత

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఘనత

📰 Generate e-Paper Clip

•63ఫోన్లనుయజమానులకుఅందజేత-‘రికవరీ మేళా’లోఎస్పీ చేతుల మీదుగా పంపిణీ
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి,25
మొబైల్ ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు యంత్రాంగం విశేష ప్రతిభ చాటింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోయిన, చోరీకి గురైన సుమారు రూ.6 లక్షల విలువైన 63 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి, జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘రికవరీ మేళా’లో బాధితులకు అందజేశారు.జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ చేతుల మీదుగా ఫోన్లను యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు వంటి కీలక డేటా ఉంటుందని, అవి దుర్వినియోగం కాకముందే స్పందించడం అత్యంత ముఖ్యమని సూచించారు.మొబైల్ పోగొట్టుకున్న వెంటనే సెంట్రల్ ఈక్వయిప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సెయిర్) పోర్టల్ www.ceir.gov.in లోఫోన్‌ను బ్లాక్ చేయాలని, అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్కువ ధరకు లభిస్తోందని సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా షాప్ యజమాని నుండి రసీదు తీసుకోవాలని హెచ్చరించారు.దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.CEIR యాప్ ద్వారా ఫోన్ల ఆచూకీ కనుగొనడంలో విశేష కృషి చేసిన ఐటి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగాఅభినందించారు. పోయిన ఫోన్లు తిరిగి దక్కుతాయని ఊహించలేదని బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.