📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సదాశివపేటలో కట్టుదిట్టమైన తనిఖీలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సదాశివపేటలో కట్టుదిట్టమైన తనిఖీలు

📰 Generate e-Paper Clip

సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో వాహనాల విస్తృత తనిఖీలు
సదాశివపేట,ఫిబ్రవరి8(మనప్రజాప్రతినిధి):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని స్థానిక సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఆదివారం సాయంత్రం ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించారు.అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించడం, అక్రమంగా నగదు, మద్యం రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేసే దిశగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పట్టణంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా కొనసాగుతాయని సీఐ వెంకటేశం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular