📄 ePaper
Friday, June 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకుక్క కాటు ఇంజెక్షన్ అనంతరం చిన్నారి మృతి

కుక్క కాటు ఇంజెక్షన్ అనంతరం చిన్నారి మృతి

📰 Generate e-Paper Clip

ప్రభుత్వాసుపత్రిలో వైద్య నిర్లక్ష్యంపై అనుమానాలు..కుటుంబ సభ్యుల ఆగ్రహం
మనప్రజాప్రతినిధి//కామారెడ్డి.ఫిబ్రవరి2
కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్‌కు చెందిన క్రితారా శ్రీ (2సంవత్సరాలు6నెలలు) అనే చిన్నారి కుక్క కాటు నివారణ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే మృతి చెందడం కలకలం రేపింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కుక్క కాటుకు గురైన చిన్నారికి ఇప్పటికే రెండు డోసుల రేబీస్ ఇంజెక్షన్లు పూర్తయ్యాయి. ఆదివారం మూడో డోస్ కోసం తల్లిదండ్రులు అర్చన, రమేశ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా, ఇంజెక్షన్ వేసిన వెంటనే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు.వెంటనే వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు నిలవకపోయాయి. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, బాధిత కుటుంబం వైద్య నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్, బిక్నూర్ సీఐ సంపత్ పోలీస్ బలగాలతో ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular