📄 ePaper
Thursday, June 25, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇల్లంతకుంట గ్రామంలో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి పరిశీలన

ఇల్లంతకుంట గ్రామంలో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి పరిశీలన

📰 Generate e-Paper Clip

వార్డు వారీగా సమస్యలపై దృష్టి-ఇల్లంతకుంటలో సర్పంచ్ తనిఖీలు
పాముల భయం నుంచి తాగునీటి వరకు-ఇల్లంతకుంటలో సమస్యల పరిశీలన
ప్రజల భద్రతకు ప్రాధాన్యం-సమస్యలపై తక్షణ చర్యలు: సర్పంచ్ మామిడి రాజు
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.2ఫిబ్రవరి
ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని 1,2,3,12 వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలను గ్రామ సర్పంచ్ మామిడి రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన వార్డుల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు.ఈ సందర్భంగా పాముల భయం, కరెంటు తీగలపై పెరిగిన చెట్లు, ప్రమాదకర స్థితిలో ఉన్న పాత ఇండ్ల తొలగింపు, తాగునీటి సమస్య, పారిశుధ్య లోపాలు వంటి అంశాలపై గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడతామని సర్పంచ్ మామిడి రాజు భరోసా ఇచ్చారు.గ్రామ అభివృద్ధి, ప్రజా భద్రతే లక్ష్యంగా పనిచేస్తామని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు చేరాల వంశీ, రాకం సుమన్, నాయకులు ఒగ్గు రమేష్, కొట్టె వెంకన్న, ఎర్రోజు రవితేజ, దయ్యాల మహేష్, దయ్యాల రామకృష్ణ, సుమన్, సంజీవ్, దేవరాజు, మణివర్మ, శ్రీకాంత్తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular