📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణప్రాజెక్టులు కట్టడం చేతకాదు.. సిట్ పేరుతో వేధింపుల

ప్రాజెక్టులు కట్టడం చేతకాదు.. సిట్ పేరుతో వేధింపుల

📰 Generate e-Paper Clip

రేవంత్ ప్రభుత్వ వైఖరిపట్ల భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు
మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 1:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పిలవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి, మున్సిపల్ సమన్వయ కర్త జైపాల్ రెడ్డిలు అన్నారు.
సిట్ విచారణ పేరుతో కేసిఆర్ ను ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీగా బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకొని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వెళ్లి రాజీవ్ చౌక్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డిలుమాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్‌పై అక్రమంగా సిట్ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడటం దుర్మార్గం అన్నారు.అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇంతవరకు అమలు చేయని అబద్దపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని,ఇచ్చిన హామీలను అమలు చేయలేక అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని అన్నారు.ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్,చెరువులను నిర్మించలేని అసమర్ధ ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మాకమైన ప్రాజెక్టును నిర్మించిన కెసిఆర్ ను ఇబ్బందులకు గురిచేయడం
ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌కు అండగా బీఆర్ఎస్ శ్రేణులు నిలబడతాయని, ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నజీబ్, నగేష్, రవీందర్ నాయక్, ముజమ్మిల్,పరశురామ్,వెంకటేశం,జైపాల్ రెడ్డి,బిఆర్ఎస్ మండల,పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.