📄 ePaper
Wednesday, August 26, 2026
Homeతెలంగాణఅభివృద్ధికి ఓటేయండి

అభివృద్ధికి ఓటేయండి

📰 Generate e-Paper Clip

– 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అస్మా పర్వీన్ అసిఫ్

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 6:


నారాయణఖేడ్ మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అస్మా పర్వీన్ అసిఫ్ శుక్రవారం జోరుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం, మున్సిపాలిటీ చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం, మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, 15వ వార్డును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఒక అవకాశం ఇవ్వాలని అస్మా పర్వీన్ అసిఫ్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.