Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఫీజుల పేరుతో హాల్ టికెట్ల నిలిపివేత అన్యాయం

ఫీజుల పేరుతో హాల్ టికెట్ల నిలిపివేత అన్యాయం

📰 Generate e-Paper Clip

•విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి – అసిస్టెంట్ కలెక్టర్‌కు వినతి
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి23
జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఫీజుల పేరుతో హాల్ టికెట్లు నిలిపివేస్తున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.ఈవ్యవహారంపై కంచర్ల రవి గౌడ్ తీవ్రంగా స్పందిస్తూ, సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఫీజులు పూర్తిగా చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వబోమని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. పరీక్షల సమయంలో ఈ విధమైన చర్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. విద్య ప్రతి ఒక్కరి మౌలిక హక్కు అని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలను గుర్తించి, ఎలాంటి షరతులు లేకుండా విద్యార్థులందరికీ వెంటనే హాల్ టికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సౌకర్యం, గాలి–వెలుతురు వచ్చేలా ఫ్యాన్లు, విశాల గదులు, సరైన బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలోఎస్.కెఅప్రోచ్,వడ్లూరి వేణు,మారంకార్తికేయ, నరేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular