📄 ePaper
Thursday, July 9, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకరీంనగర్‌లో హేమోఫిలియా అవగాహన-ఉచిత ఫ్యాక్టర్ టెస్ట్ & ఫ్యాక్టర్-8 పంపిణీ

కరీంనగర్‌లో హేమోఫిలియా అవగాహన-ఉచిత ఫ్యాక్టర్ టెస్ట్ & ఫ్యాక్టర్-8 పంపిణీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కరీంనగర్.మార్చి9,
పెద్దపల్లి హేమోఫిలియా చాప్టర్ ఆధ్వర్యంలో, ఇంటస్ ఫౌండేషన్ సహకారంతో కరీంనగర్‌లోని సిటీ ఆసుపత్రిలో ఫ్యాక్టర్ టెస్ట్ మరియు ఉచిత ఫ్యాక్టర్-8 పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
హేమోఫిలియా అనేది అరుదైన జన్యు సంబంధిత (వంశపారం పర్యంగా సంక్రమించే) రక్తస్రావ వ్యాధి. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, బాధితులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి హేమోఫిలియా చాప్టర్‌కు చెందిన 60 మందికి పైగా బాధితులకు పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ సిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ ఉపేందర్ ఆధ్వర్యంలో హేమోఫిలియా వ్యాధి లక్షణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు.అలాగే ఇంటస్ ఫౌండేషన్‌కు చెందిన శివ సార్, సుజాత మేడం సహకారంతో బాధితులకు ఉచిత ఫ్యాక్టర్ రిపోర్టులు అందజేసి, ఫ్యాక్టర్-8 ఔషధాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లులను సన్మానించారు. అలాగే పెద్దపల్లి ప్రాంతానికి చెందిన రిత్విక్ ఫ్యాక్టర్-8 కోల్పోయి మరణించిన సందర్భాన్ని స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు.
కష్టకాలంలో తమకు సహకరించిన ఇంటస్ ఫౌండేషన్ మరియు సిటీ ఆసుపత్రి వైద్యులకు పెద్దపల్లి హేమోఫిలియా చాప్టర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చాప్టర్ ఫౌండర్ వాసుదేవరావు, పెద్దపల్లి చాప్టర్ అధ్యక్షుడు మురళీకృష్ణ, సెక్రటరీ డాక్టర్ ఇ. శ్రీనివాస్, సభ్యులు హరీష్, మహేష్, ఈసీ సభ్యులు క్రాంతికుమార్, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హేమోఫిలియా బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular