📄 ePaper
Thursday, July 9, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఒడిదుడుకులను జయించి రాష్ట్ర ర్యాంక్ సాధించిన విద్యార్థిని

ఒడిదుడుకులను జయించి రాష్ట్ర ర్యాంక్ సాధించిన విద్యార్థిని

📰 Generate e-Paper Clip

ఇర్కోడ్ మోడల్ స్కూల్ విద్యార్థిని జెట్ల రక్షిత ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు.

కష్టాలను జయించి ర్యాంక్ సాధించిన జెట్ల రక్షిత..

పినతల్లివద్దపెరిగి ప్రతిభతో మెరిసిన విద్యార్థిని

సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//ఏప్రిల్16
సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జెట్ల రక్షిత అద్భుత ప్రతిభను కనబరిచింది. 436 మార్కులకు గాను 422 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రక్షిత, ఎన్నో ఒడిదుడుకులనుఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. ప్రస్తుతం తన పినతల్లి వద్ద ఉంటూ తల్లి పోషనలో,చదువుపై మక్కువతో కృషి చేసి ఈ విజయం సాధించింది.
పుస్తకాల పట్ల ఉన్న ఆసక్తి, క్రమశిక్షణతో చదవడం ద్వారా తనదైన ప్రతిభను చాటుకున్న రక్షితకు కళాశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్ చేయూతగా నిలిచి అభినందించారు .ఇతర విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular