📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణతల్లిదండ్రులపై దారుణ దాడి… మద్యం మత్తులో కొట్టిన కుమారుడు జైలుకు!

తల్లిదండ్రులపై దారుణ దాడి… మద్యం మత్తులో కొట్టిన కుమారుడు జైలుకు!

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//దౌల్తాబాద్ ఏప్రిల్ 20)

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని మచిన్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టొల్ల అలియాస్ పొట్టెళ్ల స్వామి (36), రైతు, తన తల్లిదండ్రులపై దాడి చేసిన కేసులో నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న స్వామి, ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి కర్రతో దాడి చేయగా, అతని తల్లి తీవ్రంగా గాయపడగా, తండ్రి కూడా గాయపడ్డారు.
దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. జి. అరుణ్ కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని, గజ్వేల్‌లోని గౌరవ అదనపు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు సిద్దిపేట సబ్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్‌.ఐ. మాట్లాడుతూ, తాగుడు అలవాట్లు మరియు విలాసవంతమైన జీవితం కోసం తల్లిదండ్రులను వేధించే వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.