-నేలకొండపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
మనప్రజాప్రతినిధి//నేలకొండపల్లి, జూన్18:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు..ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల సమావేశంలో మంత్రుల మీద ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలడాన్ని ఖండించారు.కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజలు చీదరించుకునే విధంగా ఉన్నాయన్నారు.పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలనలో ఖమ్మం జిల్లాకు వరగబెట్టింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.ముగ్గురు మంత్రులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని
119 నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని ఆయన తెలిపారు.బీ అరె ఎస్ నాయకులు చెవులు ఉండి చూడలేక పోతున్నారని ఆయన చెప్పారు.జిల్లాలో కేటీఆర్ ఏ గ్రామంలో అయినా పర్యటించి లబ్ధిదారుల ద్వారా వారికి ఏం చేశామో తెలుసుకోవలన్నారు…ఆ విషయంలో అయినా చర్చకు సిద్దమని సవాల్ పాలేరు లో శంకుస్థాపన చేసి వదిలేస్తే వాటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి చేస్తున్నారని ఆయన తెలిపారు..ఏదీ పూర్తి చేయని బీ ఆర్ ఎస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు…
పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదు.
RELATED ARTICLES

