📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకన్స్యూమర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా ప్రవీణ్ రెడ్డి నియామకం..

కన్స్యూమర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా ప్రవీణ్ రెడ్డి నియామకం..

📰 Generate e-Paper Clip

•బక్కి వెంకటయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందజేత
•వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం: ప్రవీణ్ రెడ్డి.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్-భూంపల్లి మండలం.జూన్19
అక్బర్‌పేట్-భూంపల్లిమండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కన్స్యూమర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా రెడ్డిపల్లి ప్రవీణ్ రెడ్డిని నియమించారు. కన్స్యూమర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కుంభాల రవి, ప్రధాన కార్యదర్శి గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య చేతుల మీదుగా ప్రవీణ్ రెడ్డికి నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో కన్స్యూమర్ అసోసియేషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవలో ముందుండి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు బక్కి వెంకటయ్యను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కన్స్యూమర్ అసోసియేషన్ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని నూతన మండల అధ్యక్షుడు రెడ్డిపల్లి ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ మాజీ సర్పంచ్ బండమీది మల్లయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నెల్లుట్ల నర్సవ్వ, సంధిరెడ్డి శంకరవ్వ, గురుజకుంట కావ్యతో పాటు అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.