📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దీక్ష పరివార్ విద్యార్థుల సత్తా

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దీక్ష పరివార్ విద్యార్థుల సత్తా

📰 Generate e-Paper Clip

°బంగారు పతకంతో రాష్ట్ర స్థాయికి పి.లక్ష్మీ.మధుమతి ఎంపిక. °18మంది విద్యార్థుల పాల్గొనడం..పలు విభాగాల్లో పతకాలు.
°విజేతలనుఅభినందించినప్రిన్సిపాల్,యాజమాన్యం,ఉపాధ్యాయ బృందం

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జులై8
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దీక్ష పరివార్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తీసుకువచ్చారు. అండర్-14, అండర్-12, అండర్-10, అండర్-8 విభాగాల్లో మొత్తం 18 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
అండర్-14 విభాగంలోని ట్రయాథ్లాన్ పోటీల్లో పి. లక్ష్మీ మధుమతి అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించింది.
అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగుపందెంలో ఎం. కృతజ్ఞ మూడో స్థానం దక్కించుకుంది. అండర్-14 ట్రయాథ్లాన్ బి గ్రూప్‌లో ఎ. స్నేహిత్, ట్రయాథ్లాన్ ఎ గ్రూప్‌లో డి. లాస్య తృతీయ స్థానాలు సాధించి పాఠశాల ఖ్యాతిని మరింత పెంచారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పి. శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం విజేతలను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పి. లక్ష్మీ మధుమతి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.