📄 ePaper
Friday, August 21, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునూతన తహసిల్దార్‌కు ఘన స్వాగతం.. సన్మానించిన సర్పంచులు

నూతన తహసిల్దార్‌కు ఘన స్వాగతం.. సన్మానించిన సర్పంచులు

📰 Generate e-Paper Clip

°నూతన తహసిల్దార్ వేణుగోపాల్‌కు సర్పంచుల ఘనసన్మానం.
°రైతులు, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సేవలందిస్తానన్న తహసిల్దార్
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.జూలై16
కుకునూరుపల్లి మండల నూతన తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్‌ను మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఘనంగా సన్మానించారు. బుధవారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో తహసిల్దార్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన తహసిల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ మండల ప్రజలకు, ముఖ్యంగా రైతులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సేవలందిస్తూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.