📄 ePaper
Friday, August 21, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఏడుపాయల దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

ఏడుపాయల దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

“కారుపల్టీలుకొట్టిపొలంలోకిదూసుకెళ్లిమహిళమృతి..ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు
మనప్రజాప్రతినిధి.సిద్దిపేటనియోజకవర్గం.జూలై31
ఏడుపాయల దేవస్థాన దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం మెదక్ జిల్లా తోర్నాల గ్రామ శివారులో చోటుచేసుకుంది.
బాధితుడు బెజిగం వినేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..జూలై 30న కుటుంబ సభ్యులు ఏడుపాయల దేవస్థానానికి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం వేళ అల్లుడు ద్వారకేష్ కారు (TS36N4995)లో బెజిగం శ్రీలత (39), పిల్లలు బెజిగం లిఖిత్ (18), శ్రీమాన్ (10), శ్రేష్ఠ (12)లను ఎక్కించుకుని సిద్దిపేటకు బయలుదేరారు.
సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో తోర్నాల గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే, డ్రైవర్ ద్వారకేష్ కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో బెజిగం శ్రీలత తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న లిఖిత్, శ్రీమాన్, శ్రేష్ఠలకు తీవ్ర రక్తగాయాలు కావడంతో వెంటనే వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఫిర్యాదుదారు బెజిగం వినేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.