📄 ePaper
Friday, August 21, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపేదల సొంతింటి కలకు శ్రీకారం

పేదల సొంతింటి కలకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

బక్రీచెప్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
మనప్రజాప్రతినిధి,సిద్దిపేటనియోజకవర్గం.ఆగస్టు1
సిద్దిపేట అర్బన్ మండలంలోని బక్రీ చెప్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాస అంజయ్య, సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొత్తం లక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మార్క సతీష్ కుమార్, సిద్ధి రాములు, సనా రజిని, మల్లేశం, మెరుగుల నరసింహులు, మల్లోజి వేణు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి పథకం లబ్ధిదారులు జక్కుల భవాని–ఆంజనేయులు కుటుంబం ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించగా, గ్రామ పెద్దలు హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని, ప్రజల్లో ఆనందం నెలకొందని అన్నారు.
అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణకు లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభివందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.