పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరమ్మ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:
భారతదేశపు ఉక్కు మహిళ, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం కల్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
*ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ…* దేశ సమగ్రతను కాపాడటానికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. హరిత విప్లవం ద్వారా దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేశారని, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నేటి తరం నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లూరు గ్రామ సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకుడు చలసాని రాజీవ్, కల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడిగె వెంకటేశ్వర్లు గౌడ్, నేరేడుచర్ల మాజీ అగ్రికల్చర్ డైరెక్టర్ కొడాలి పట్టయ్య, మాజీ పిఏసీఎస్ చైర్మన్ కొడాలి భాస్కర్ రావు, మాజీ వైస్ ఎంపీపీ చలసాని మాధవరావు, ఉప సర్పంచ్ ఉప్పెల్లి మహేష్,యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మేకపోతుల నాగరాజు, పిచ్చయ్య, బుడిగె మల్లయ్య,రోశయ్య, సోమయ్య, రంగయ్య, హుస్సేన్, హరికృష్ణ, సిరికొండ జానకి రాములు, ప్రేమ్ కుమార్, ఉప్పెల్లి రాములు, వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటయ్య, సోమయ్య, గుడుగుంట్ల వెంకటయ్య, బిక్షం, శేఖర్, గజగంటి ప్రవీణ్, దానేలు, అక్కయ్య బాబు, సుదర్శన్, అనంతు వెంకటేశ్వర్లు, రమేష్, భార్గవ్, జగన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ కి ఘన నివాళి
RELATED ARTICLES



