Monday, April 20, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్రాజానగరం ఉపాధ్యాయురాలు జ్యోత్స్నభాయ్ మృతి పట్ల సంతాపం

రాజానగరం ఉపాధ్యాయురాలు జ్యోత్స్నభాయ్ మృతి పట్ల సంతాపం

📰 Generate e-Paper Clip

తునిలో చివరి దర్శనానికి మంత్రి అనిత వంగలపూడి హాజరు
పిల్లల విద్యాభాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు

తుని, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
రాజానగరం పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోత్స్నభాయ్ ఆకస్మిక మరణం పాలిట కావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ప్రాంతీయ విద్యా వర్గాలను, స్థానిక ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయిన కుటుంబానికి ఇది మరొక పెద్ద దెబ్బగా మారింది. తునిలో జరిగిన చివరి దర్శన కార్యక్రమానికి  మంత్రి అనిత వంగలపూడి హాజరై పుష్పాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి, ప్రభుత్వం సంపూర్ణ సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. జ్యోత్స్నభాయ్ మృతి పట్ల వ్యక్తిగతంగా బాధపడ్డానని ఆమె పేర్కొన్నారు.
కుటుంబంలో చదువుతున్న ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు గురించి మంత్రి హామీ ఇచ్చారు. పిల్లల విద్యాభాధ్యతను ప్రభుత్వం భుజస్కందం చేస్తుందని తెలిపారు. వారి భవిష్యత్తు దిశగా ఏ లోటు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి, సంబంధిత అధికారులు ఆ కుటుంబానికి అలాంటి పరిస్థితుల్లో అవసరమైన పూర్తి సహాయాన్ని అందించాలని ఆదేశించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణ సాయం, పాఠశాల విద్యకు సంబంధించిన అవసరాల్ని ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular