హైదరాబాద్, నవంబర్ 22( మనప్రజాప్రతినిధి):
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు, యువ నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ నేడు తన 34వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. సినీ పరిశ్రమలోని అనేకమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, ముఖ్యంగా ‘వారణాసి’ చిత్ర బృందం పంపిన సందేశాలు ప్రత్యేకంగా నిలిచాయి. అందులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కార్తికేయ పుట్టినరోజును పురస్కరించుకుని పంపిన సందేశంలో—
“మేం నిర్మించే ప్రతి పనికి వెనక నిలిచే నిశ్శబ్ద శక్తి నువ్వే. కఠినమైన పనుల్నీ సులభంగా, శాంతంగా పూర్తి చేసే నీ తీరు ఎప్పుడూ ఆశ్చర్యమే. ఈ కొత్త సంవత్సరం నీకు మరింత విజయాలు తీసుకురావాలి,” అని ప్రేమగా రాశారు.
“తేలికగా తీసుకో నా మిత్రమా! ప్రతి గొప్ప పనికి వెనక నిలబడే నిశ్శబ్ద వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు. ‘వారణాసి’ ప్రయాణంలో నీతో కలిసి డాన్స్ చేయడం చాలా ప్రత్యేక అనుభవం,” అంటూ ప్రియాంక రాసుకొచ్చింది. ఆమె దీనితో పాటు ఓ సరదా వీడియోను కూడా పంచుకుంది. అందులో ‘ప్రేమికుడు’ సినిమా లోని ‘ఊర్వశి ఊర్వశి’ పాటకు కార్తికేయతో కలిసి అడుగులు వేస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కార్తికేయ ప్రస్తుతం ‘వారణాసి’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజమౌళి పర్యవేక్షణ, మహేశ్‌బాబు ప్రధాన పాత్ర, ప్రియాంక చోప్రా కీలక పాత్ర — ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటానికి ముఖ్య కారణాలు.
కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు పంపుతున్న శుభాకాంక్షలు సోషల్ మీడియా అంతా సందడి చేస్తున్నాయి.
ప్రియాంకతో స్టెప్పులు… మహేశ్‌బాబుతో ప్రశంసలు…
RELATED ARTICLES

