అందోల్ (మనప్రజాప్రతినిధి నవంబర్ 23):
సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంతో, స్టేజి ఉన్నచోట బస్సు ఆపకపోవడంతో, ఆందోల్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అందోల్ ఎమ్మెల్యే ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, దామోదర్ రాజనర్సింహ, సొంత ఇలాక లోనే, పరిస్థితి ఈ విధంగా ఉంది, గ్రామస్తులు,యువకులు, ఉద్యోగులు, తరచుగా ఆర్టీసీ సంస్థకు ఫిర్యాదు చేస్తున్న ఎటువంటి మార్పు రాలేదు, గ్రామస్తులతో ప్రయాణికులతో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ సిబ్బంది, దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు, అందోల్ వద్ద స్టేజి లేదు, బస్సు ఆపడం కుదరదు అంటూ, సాకు చూపిస్తూ, బస్సులను స్టేజి వద్ద నిలపడం లేదు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, ఉన్న ఆందోల్ లో స్టేజి లేదని చెప్పడం, ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్ కే సాధ్యమైందని చెప్పవచ్చు, సంగారెడ్డి,నారాయణఖేడ్,మెదక్, సిద్దిపేట,దుబ్బాక,గజ్వేల్, హైదరాబాద్ 1%2, బాన్సువాడ, డిపోలకు చెందిన బస్సులకు స్టాప్ ఉండేలా చూడాలని, అందోల్ గ్రామస్తులు, శనివారం నాడు, సంగారెడ్డి పట్టణంలోని డిపో మేనేజర్లకు, అందోల్ గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు, తరతరాలుగా అందోల్ గ్రామం పేరుగాంచింది, కానీ నేటి ఆధునిక కాలంలో, చరిత్ర అందోల్ గ్రామమును కనుమరుగు చేస్తున్న, ఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారులైన, పూర్తి విచారణ జరిపి, చర్యలు తీసుకొని, అందోల్ బస్సు స్టేజి వద్ద బస్సులు ఆపే విధంగా, చర్యలు తీసుకోవాలని వారు గ్రామ ప్రజలు కోరుతున్నారు…
కనుమరుగవుతున్న అందోల్ ఆర్టీసీ బస్ స్టాప్
RELATED ARTICLES

