📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుయూనిటీ మార్చ్‌కి సిద్దిపేట యువ నేత తాటికొండ శ్రీనివాస్ ఎంపిక

యూనిటీ మార్చ్‌కి సిద్దిపేట యువ నేత తాటికొండ శ్రీనివాస్ ఎంపిక

📰 Generate e-Paper Clip

సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంలో నిర్వహిస్తున్నతీయ యాత్ర

సిద్దిపేట :మన ప్రజాప్రతినిధి
సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక“యూనిటీ మార్చ్”లో పాల్గొనేందుకు సిద్దిపేట నుండి యువ నాయకుడు తాటికొండ శ్రీనివాస్ ఎంపిక కావడం జిల్లాలో ఆనందాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే యువ నాయకులను ఎంపిక చేస్తుండగా, సిద్దిపేట జిల్లాకు ఈ అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నారు.
యూనిటీ మార్చ్ ఈ నెల 24వ తేదీన నాగపూర్‌లో ప్రారంభం కానుంది. అక్కడి నుండి ఇండోర్ మీదుగా ప్రయాణిస్తూ, గుజరాత్‌లోని ప్రపంచంలో అతిపెద్ద విగ్రహంగా నిలిచిన ఐక్యతా ప్రతీక “స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ” వద్ద 30వ తేదీన ముగియనుంది.

ఈ సందర్భంగా తాటికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ—
“జిల్లా నుండి నన్ను ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఎంపిక చేయడం పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నన్ను విశ్వసించి అవకాశమిచ్చిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారికి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తెలిపారు.
సర్దార్ వల్లభాయి పటేల్ జీవితంపై మాట్లాడుతూ ఆయన అన్నారు. “మన తెలంగాణను నిరంకుశ పాలన నుండి విముక్తి చేసి, స్వేచ్ఛా వాతావరణం తీసుకువచ్చేందుకు ఆపరేషన్ పోలో చేపట్టిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాలలో పాల్గొనడం తెలంగాణ వ్యక్తిగా నా అదృష్టంగా భావిస్తున్నాను.”
జిల్లా రాజకీయ పెద్దలు, యువ నాయకులు, స్థానిక ప్రజలు తాటికొండ శ్రీనివాస్ ఎంపికను అభినందిస్తూ, యూనిటీ మార్చ్‌లో ఆయన ప్రతిభను ప్రదర్శించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.