📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే దొంగల పాలన పోవాలి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.

తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే దొంగల పాలన పోవాలి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి జిల్లా.
నవంబర్ 29,{మనప్రజాప్రతినిధి }

కంది గ్రామంలోని బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో దీక్షా దివస్ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేసి, కేసీఆర్ చిత్రపటానికిపాలాభిషేకం చేయగా,తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు.ఉద్యమచరిత్రనుప్రతిబింబించే ఫోటో ప్రదర్శననుఏర్పాటుచేసి,అనంతరంఉద్యమకారులనుసన్మానించారు.కార్యక్రమానికి ముందుగాసంగారెడ్డి ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, “తెలంగాణఉద్యమ చరిత్రలో, రాష్ట్ర భవిష్యత్తులో ఈరోజు అత్యంత కీలకమైన రోజు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటూ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు ఇది” అన్నారు.”కేసీఆర్ఆరోజునగట్టిగానిలబడకపోతేఈరోజుతెలంగాణరాష్ట్రంఉండేదికాదు.నాడుఉద్యమాన్నిఅణిచివేయాలనుకున్నకాంగ్రెస్,నేడుఅధికారంలోకివచ్చికేసీఆర్ఆనవాళ్లుచెరిపేయాలని చూస్తోంది. ఇది కాంగ్రెస్ మూర్ఖత్వం”అనిపేర్కొన్నారు.అలాగే, “తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటారు. చరిత్రను ఎవరూ చెరపలేరు. రేవంత్ రెడ్డిపై ఉన్నది ఓటుకు నోటు మాయమే. ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన రేవంత్‌కు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.”తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే దొంగల పాలన పోవాలి. బిఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గొంతుకగా పోరాడుతాం. ఈ అరాచక పాలన ఎక్కువ కాలం నిలవదు. మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే… వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే” అని చింతా ప్రభాకర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి, పటాన్‌చెరు కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, DCMS చైర్మన్ శివకుమార్, బాలయ్య, మందుల వరలక్ష్మి, డా. శ్రీహరి, ఉద్యమకారులు, మహిళలు, వివిధ నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.