📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపులిమామిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యమ్మాజీ నర్సాగౌడ్ నామినేషన్

పులిమామిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యమ్మాజీ నర్సాగౌడ్ నామినేషన్

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి //అక్బర్ పేట్, భూంపల్లి:డిసెంబర్ 1
చేగుంట మండల్, మెదక్ జిల్లా – పులిమామిడి గ్రామ సర్పంచ్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రసిద్ధి చెందిన సంఘ సేవకుడు యమ్మాజీ నర్సాగౌడ్ సోమవారం ఎంపిడీఓ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.
ఈ సందర్భంగా యమ్మాజీ నర్సాగౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు భారీ మెజార్టీతో విజయం సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే నంబర్ వన్ గ్రామపంచాయితీగా తీర్చిదిద్దటం తమ ప్రధాన కర్తవ్యం అని హామీ ఇచ్చారు.దుబ్బాక నియోజకవర్గ సహకారంతో ఆదర్శ గ్రామంగా అభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తారని, పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలను సంవత్సరాంతం లోపే పరిష్కరించి, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గొర్రె పేదోళ్ల స్వామి, యమ్మాజీ యాదగౌడ్, గొర్రె బాలెల్లం, మద్దూర్ రాజు, గొర్రె శ్రీహరి, యమ్మాజీ నందిశ్వర్ గౌడ్, మండ్ల బిక్షపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular